రూ. 25,000 కోట్ల సమీకరణకు ఓకే
సమ్మాన్ క్యాపిటల్ రూ. 25,000 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. సెక్యూర్డ్ లేదా అన్ సెక్యూర్డ్ రిడీమబుల్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ లేదా బాండ్ల ద్వారా ప్రైవేట్ ప్లేస్మెంట్ పద్ధతిలో సమీకరించాలని ఇవాళ బోర్డు నిర్ణయించింది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ అయిన సమ్మాన్ క్యాపిటల్లో అబుదబికి చెందిన IHC మెజారిటీ వాటా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. సుమారు రూ. 8,850 కోట్లతో ఈ డీల్ కుదిరింది. తరవాత ఓపెన్ ఆఫర్ కూడా ప్రకటించారు. ఇవాళ జరిగిన బోర్డు సమావేశంలో షెఫాలి షాను ఇండిపెండెంట్ డైరెక్టర్గా మరో మూడేళ్ళ పాటు కొనసాగేలా బోర్డు ఆమోదం తెలిపింది.
షేర్ డబుల్ అవుతుంది
సమ్మాన్ క్యాపిటల్ టర్న్ అరౌండ్ ప్రారంభమౌందని ప్రముఖ రీసెర్చి సంస్థ వెంచురా పేర్కొంది. కంపెనీకి ఓ పూర్తి స్థాయి రీసెర్చి రిపోర్టును విడుదల చేసింది. ప్రస్తుతం రూ. 152.3 వద్ద ఉన్న ఈ కంపెనీ షేర్ 24 నెలల్లో రూ. 377.7లకు చేరుతుందని అంచనా వేసింది. ఈ మేరకు కంపెనీ సాధించే బోయే ప్రగతికి సంబంధించిన అంచనా డేటాను కూడా విడుదల చేసింది. గత మార్చితో ముగిసిన FY 26లో కంపెనీ రూ. 2,200 కోట్ల నెట్ ఇంటరెస్ట్ ఇన్కమ్ (NII)పై రూ. 7598 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. ఇపుడు పూర్తి స్థాయిలో కంపెనీ టర్న్ అరౌండ్పై దృష్టి సారించిందని వెంచురా వెల్లడించింది. వచ్చే ఏడాది అంటే మార్చి 2027 ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ రూ. 2920 కోట్ల NIIపై రూ. 1,920 కోట్ల నికర లాభం గడిస్తుందని అంచనా వేసింది. అలాగే FY28లో రూ. 4755 కోట్ల NIIపై రూ. 2,504 కోట్ల నికర లాభాన్ని ఆర్జిస్తుందని తెలిపింది. ఇక FY29 ఏడాదిలో రూ. 7377 కోట్ల నికర వడ్డీ ఆదాయంపై రూ. 4,916 కోట్ల నికర లాభం ఆర్జిస్తుందని వెంచురా అంచనా వేసింది. అప్పటికి సవరించిన బుక్ వ్యాల్యూ రూ. 188.8కి చేరుతుందని పేర్కొంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ (ROE) కూడా రూ. 13 శాతానికి చేరుతుందని స్పష్టం చేసింది. గతంలో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ పేరుతో ఉన్న ఈ కంపెనీ తీవ్ర ఒడుదుడుకులకు గురైంది. కంపెనీకి రుణం ఇచ్చిన ప్రతి రుణదాతకు రూ. 83,000 కోట్ల రుణం, రూ. 40,000 కోట్ల వడ్డీని తిరిగి చెల్లించింది. భారత ఎన్బీఎఫ్సీ చరిత్రలో ఇదొక రికార్డు. ఆ తరవాత FY26లో రూ. 6,499 కోట్లను One time Exceptional Charge కింద చెల్లింది. దీంతో కంపెనీ పుస్తకాలన్నీ క్లీన్ అయిపోయాయి. జీరో ఎన్పీఏతో రూ.53,160 కోట్ల AUMతో సమ్మాన్ క్యాపిటల్ ఇపుడు వ్యాపారం నిర్వహిస్తోంది. బ్యాలెన్స్ షీట్ క్లీన్గా ఉన్నందున కంపెనీ శరవేగంగా వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని వెంచురా పేర్కొంది.
