జీఎంఆర్ రూ.6,000 కోట్ల సమీకరణ!
ఢిల్లీ ఎయిర్పోర్టును నిర్వహిస్తున్న జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిఎటడ్ రూ.6,000 కోట్ల నిధులు సమీకరించాలని భావిస్తోంది. వివిధ సాధానాల జారీ ద్వారా ఈ నిధులను సమీకరించాలని భావిస్తోంది. ఈ ప్రతిపాదనపై ఈ నెల 13న జరగనున్న కంపెనీ డైరెక్టర్ల బోర్డు తుది నిర్ణయం తీసుకోనుంఇ. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్యూఐపీ) ద్వారా షేర్ల జారీ, ఫారిన్ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్లు తదితర మార్గాల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మార్గాల్లో నిధులు సమీకరించాలని జీఎంఆర్ యోచిస్తోంది.