For Money

Business News

NIFTY TRADE: పెరిగితే అమ్మండి

నిఫ్టి 16200-16400 మధ్య కదలాడే అవకాశముంది. కాబట్టి అధిక స్థాయిలో అమ్మడం, దిగువ స్థాయిలో కొనడం… ఈ ఫార్ములా మరికొన్ని రోజులు కొనసాగవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లు చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉన్నాయి. సో.. నిఫ్టి పెరిగినపుడు అమ్మి.. తగ్గినపుడు కొనడం మంచిది. పొజిషనల్‌ ట్రేడర్స్‌ తమ పొజిషన్స్‌ కొనసాగింవచ్చు. డే ట్రేడర్స్‌కు మాత్రం రెండు వైపులా ఛాన్స్‌ వస్తోంది. నిఫ్టి క్రితం ముగింపు 16,280. సింగపూర్ నిఫ్టి సూచించినట్లు నిఫ్టి 16,330 ప్రాంతంలో ఓపెనైతే కాస్సేపు ఆగండి. నిఫ్టికి తొలి ప్రతిఘటన స్థాయి16340-16360 మధ్య రావొచ్చు. ఈ స్థాయిలో అమ్మేవారు 16,380 స్టాప్‌లాస్‌తో ట్రేడ్‌ చేయొచ్చు. రిస్క్‌ తీసుకునేవారు కాస్త దిగువనే అమ్మొచ్చు. నిఫ్టికి ఇవాళ్టి కీలకస్థాయి 16,280 ఈ స్థాయి పైన ఉన్నంత వరకు నిఫ్టికి ఢోకా లేదు. దిగువకు వస్తే మాత్రం నిఫ్టి 16,220 ప్రాంతానికి రావొచ్చు. నిన్న నిఫ్టి 16,200 ప్రాంతానికి వచ్చిన విషయం తెలిసిందే. ఒకవేళ పడితే ఇదే స్థాయిని స్టాప్‌లాస్‌గా పెట్టుకుని16,220 ప్రాంతంలో కొనుగోలు చేయొచ్చు. 16,380 పైన అమ్మొద్దు. అలాగే 16,200 దిగువన కొనుగోలు చేయొద్దు.