For Money

Business News

ఎన్‌డీటీవీ ఓపెన్‌ ఆఫర్‌కు సెబీ ఓకే

ఎన్‌డీటీవీలో అదనంగా 26 శాతం వాటా కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్‌ ఓపెన్‌ ఆఫర్‌ చేయనుంది. అదానీ ఓపెన్‌ ఆఫర్‌కు స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఓపెన్‌ ఆఫర్‌ ఈనెల 22వ తేదీన ప్రారంభమై డిసెంబర్‌ 5న ముగుస్తుంది. వాస్తవానికి గత నెలలో ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించాల్సి ఉంది. సెబీ నుంచి ఆమోదం లభించకపోవడంతో ఆలస్యమైంది. ఎన్‌డీటీవీలో గత ఆగస్టులో పరోక్ష పద్ధతిలో 29.18శాతం వాటాను అదానీ గ్రూప్‌ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అదానీ గ్రూప్‌ ఒక్కో షేర్‌కు రూ. 294లు ఆఫర్‌ చేస్తున్నారు. అయితే ఇవాళ ఎన్‌డీటీవీ షేర్‌ రూ. 364.85 వద్ద ముగిసింది. అంటే ఓపెన్‌ ఆఫర్‌లో 24 శాతం అధిక ధరతో ట్రేడ్‌ అవుతోందన్నమాట. దీంతో ఓపెన్‌ ఆఫర్‌కు ఇన్వెస్టర్లు స్పందిస్తారా అన్నది చూడాలి.