For Money

Business News

AP, TS: అమ్మకానికి బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆస్తులు

టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌కు చెందిన ఆస్తుల అమ్మకం ప్రక్రియను నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రారంభించింది. ఒకవైపు ఆ కంపెనీ పునరుద్ధరణకు ప్యాకేజీ ప్రకటించి.. మరో వైపు ఆ సంస్థ ఆస్తులను అమ్ముతోంది. ఏపీ, తెలంగాణతోపాటు నాలుగు రాష్ర్టాల్లో సంస్థకు ఉన్న ఆస్తులను వేలం వేయనున్నట్లు ప్రకటించింది. మొత్తం 13 ఆస్తుల విక్రయానికి సంబంధించి వచ్చే నెల 5 నుంచి బిడ్డింగ్‌లను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించింది. అమ్మకానికి పెడుతున్న ఈ 13 ఆస్తుల విలువ రూ.20,160 కోట్లుగా ఉంటుందని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌(దీపం) అంచనా వేసింది. తెలంగాణలోని పటాన్‌చెరు, ఆంధప్రదేశ్‌లోని తాడేపల్లిగూడెం, కొండపల్లిలోని ఆస్తులతో పాటు గుజరాత్‌లోని సూరత్‌, భారుచ్‌ వద్ద ఉన్న ఆస్తులను అమ్మనుంది. ఇక మధ్యప్రదేశ్‌లోని పురాని ఇటార్సీ, దేవాస్‌ సిటీ, ఉత్తరప్రదేశ్‌లోని లక్నో, బిజ్‌నార్‌ వద్ద ఆస్తులను కూడా అమ్మనున్నట్లు కేంద్రం వెల్లడించింది.