For Money

Business News

కోలుకుంటున్న నాస్‌డాక్‌

భారీ నష్టాల నుంచి నాస్‌డాక్‌ కోలుకుంటోంది. ఓపెనింగ్‌లో 11,167ను తాకిన నాస్‌డాక్‌ ఇపుడు 11,264 వద్ద ట్రేడవుతోంది. నాస్‌డాక్‌ 0.5 శాతం నష్టంతో,ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ దాదాపు క్రితం స్థాయి వద్దే ట్రేడవుతున్నాయి. డౌజోన్స్ మాత్రం 0.13 శాతం లాభంతో ఉన్నాయి. కార్పొరేట్‌ ఫలితాల డేటా కోసం మార్కెట్‌ ఎదురు చూస్తోంది. మరోవైపు యూరో మార్కెట్లు అర శాతంపైగా లాభంతో ఉన్నాయి. యూరో స్టాక్స్‌ 50 సూచీ 0.7 శాతం లాభంతో ఉంది. మరోవైపు డాలర్‌ అర శాతంపైగా లాభంతో ఉంది. అలాగే బాండ్‌ ఈల్డ్స్‌ కూడా స్వల్పంగా పెరిగాయి. ఇక క్రూడ్‌ ఆయిల్ స్థిరంగా ఉంది. బ్రెంట్ క్రూడ్‌ 96 డాలర్ల ప్రాంతంలో ఉంది. ఇక బులియన్‌లో వెండి ఒకటిన్నర శాతం లాభంతో ఉండగా, బంగారం మాత్రం కేవలం అర శాతంలోపు లాభాల్లో ఉంది.