For Money

Business News

14,500పైన ట్రేడవుతున్న నిఫ్టి

ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నా.. మన మార్కెట్లు గ్రీన్‌లో ప్రారంభమయ్యాయి. నిఫ్టి ప్ర్తుతం 46 పాయింట్ల లాభంతో 14,531 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. బ్యాంక్‌ నిఫ్టి స్వల్ప నష్టాల్లో ఉన్నా… ఫార్మా, మెటల్‌, ఫార్మా షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఆటో షేర్లు కూడా పరవాలేదు. ప్రైవేట్‌ బ్యాంకు షేర్లు నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టి 14,550 వద్ద తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటోంద. నిఫ్టి గనుక ఈ స్థాయిని దాటితే నిఫ్టిని అమ్మడానికి ఛాన్స్‌గా భావించవచ్చని అనలిస్టులు అంటున్నారు. నిఫ్టి 14400-14425 మధ్య కొనుగోలు చేయొచ్చని పేర్కొంటున్నారు. అయితే 30 పాయింట్ల స్టాప్‌లాస్‌తో ఈ స్థాయిల వద్ద పొజిషన్స్‌ తీసుకోవచ్చని సలహా ఇస్తున్నారు.

నిఫ్టి టాప్ గెయినర్స్
హిందాల్కో 359.85 3.30
రిలయన్స్‌ 1,975.00 1.92
బజాజ్‌ ఫైనాన్స్‌ 4,792.95 1.19 టాటా స్టీల్‌ 951.65 1.16 పవర్‌గ్రిడ్‌ 218.15 1.09

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
యాక్సిస్‌ బ్యాంక్‌ 689.50 -1.56
కొటక్‌ బ్యాంక్‌ 1,734.45 -1.43
ఎస్‌బీఐ లైఫ్‌ 934.10 -0.89
హెచ్‌డీఎఫ్‌సీ 2,491.30 -0.74
ఏషియన్‌ పెయింట్స్‌ 2,544.95 -0.51