For Money

Business News

14650 పైన ముగిసిన నిఫ్టి

ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్‌కు క్రమంగా మద్దతు వచ్చింది. మెటల్స్‌ మెరవడంతో పాటు బ్యాంకు షేర్లు అండగా నిలబడటంతో నిఫ్టి 14600పైన పటిష్ఠంగా ముగిసింది. ఎక్కడా నిఫ్టి ఒత్తిడి ఎదురు కాకపోవడం విశేషం. 14,500 దిగువన మార్కెట్‌కు మంచి సపోర్ట్‌ లభించింది. దీంతో మిడ్‌ సెషన్‌ తరవాత యూరో మార్కెట్లలో ఒత్తిడి వచ్చినా మన మార్కెట్లలో లాభాలు కొనసాగాయి. కోవిడ్‌ కేసుల సంఖ్య తగ్గడం కూడా మార్కెట్‌కు కాస్త సానుకూల సంకేతాలు పంపింది. క్రితం ముగింపుతో పోలిస్తే 168 పాయింట్ల లాభంతో నిఫ్టి 14,653 పాయింట్ల వద్ద ముగిసింది. మిడ్‌ క్యాప్‌ షేర్ల సూచీకూడా ఒకటిన్నర శాతం దాకా లాభాలతో ముగిసింది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
హిందాల్కో 366.00 5.07
టాటా స్టీల్‌ 982.00 4.38
ఎల్‌ అండ్‌ టీ 1,384.00 3.60 దివీస్‌ ల్యాబ్‌ 3,919.90 3.58
బజాజ్‌ ఫైనాన్స్‌ 4,886.00 3.16

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ 679.20 -3.58
ఎస్‌బీఐ లైఫ్‌ 927.00 -1.64
మారుతీ 6,552.00 -1.31
ఎన్‌టీపీసీ 101.85 -0.54 నెస్లే ఇండియా 16,791.00 -0.47