For Money

Business News

మళ్ళీ లాభాల్లోకి యాక్సిస్‌ బ్యాంక్‌

యాక్సిస్‌ బ్యాంక్‌ మళ్లీ లాభాల బాట పట్టింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి బ్యాంక్‌ రూ.2,677 కోట్లుగా నికర లాభం ఆర్జించింది. మొండిబకాయిల కోసం కేటాయింపులు గణనీయంగా తగ్గడం దీనికి కారణం. 2019-20లో ఇదే కాలానికి బ్యాంక్‌ రూ.1,387.78 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. క్యూ4లో బ్యాంక్‌ మొత్తం ఆదాయం రూ.20,213.46 కోట్లుగా ఉంది. మొండిబకాయిలు, తక్షణ అవసరాల కోసం గడిచిన మూడు నెలల్లో రూ.3,294.98 కోట్ల కేటాయింపులు జరిపింది. క్యూ4లో బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) వార్షిక ప్రాతిపదికన 11 శాతం పెరిగి రూ.7,555 కోట్లకు చేరుకుంది. నికర వడ్డీ మార్జిన్‌ (ఎన్‌ఐఎం) 3.56 శాతానికి పెరిగింది. స్థూల నిరర్థక ఆస్తులు(ఎన్‌పీఏ) 3.70 శాతానికి తగ్గగా.. నికర ఎన్‌పీఏలు 1.05 శాతానికి జారుకున్నాయి.