For Money

Business News

మారుతీ లాభం ఓకే

మారుతి సుజుకీ ఇండియా నాలుగో త్రైమాసికంలో కంపెనీ రూ.1,241.1 కోట్ల నికర లాభం ప్రకటించింది. 2019-20 ఇదే కాలానికి ఆర్జించిన రూ.1,322.3 కోట్ల లాభంతో పోలిస్తే 6.14 శాతం తక్కువ. ఈ జనవరి-మార్చి కాలానికి ఆదాయం మాత్రం 33.58 శాతం పెరిగి రూ.22,959.8 కోట్లకు చేరుకుంది. గడిచిన మూడు నెలల్లో కంపెనీ 4,92,235 కార్లను విక్రయించింది. 2020లో ఇదే కాలానికి నమోదైన అమ్మకాలతో పోలిస్తే 27.8 శాతం అధికం. 2020-21 ఆర్థిక సంవత్సరం మొత్తానికి కంపెనీ 14,57,861 కార్లను విక్రయించింది. 2019-20తో పోలిస్తే 6.7 శాతం, 2018-19తో పోలిస్తే 21.7 శాతం తక్కువ. వాటాదారులకు ఒక్కో షేరుకు రూ.45 డివిడెండ్‌ చెల్లించాలని బోర్డు నిర్ణయించింది.