For Money

Business News

BUY&SELL: అంబుజా సిమెంట్

డే ట్రేడర్స్‌కు ఇవాళ అంబుజా సిమెంట్‌ మంచి కొనుగోలు అవకాశం ఇస్తోందని అనలిస్టులు అంటున్నారు. నిన్న ఈ షేర్‌ రూ.303 వద్ద ముగిసింది. డే ట్రేడర్స్‌ ఈ షేర్‌ రూ.290 స్టాప్‌ లాస్‌తో రూ.325 టార్గెట్‌తో కొనుగోలు చేయొచ్చని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌కు చెందిన ధర్మేష్‌ షా సిఫారసు చేస్తున్నారు. ఇక ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో కూడా ఈ షేర్‌ను రెకమెండ్‌ చేస్తున్నారు ఇదే సంస్థకు చెందిన రాజ్‌ దీపక్‌ సింగ్‌ (డెరివేటివ్స్‌-హెడ్‌). రూ. 292 స్టాప్‌లాస్‌తో రూ.325 టార్గెట్‌ కోసం అంబుజా సిమెంట్‌ను సిఫారసు చేస్తున్నారు. ఈ సిరీస్‌ ఎల్లుండితో ముగియనుంది. ఇటీవల ఈ షేర్‌లో లాభాల స్వీకరణ జరిగిందని…ఫలితంగా ఈ షేర్‌కు ప్రస్తుత ధర వద్ద సపోర్ట్‌ లభిస్తుందని రాజ్‌ దీపక్‌ సింగ్‌ సిఫారసు చేస్తున్నారు.