For Money

Business News

స్థిరంగా ప్రారంభం కానున్న నిఫ్టి

నిన్న ఒక శాతం పెరిగిన నిఫ్టి ఇవాళ స్థిరంగా లేదా స్వల్ప నష్టంతో ప్రారంభమయ్యే అవకాశముంది. రాత్రి అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. డౌజోన్స్‌ రెడ్‌లో క్లోజ్‌ కాగా,మిగిలిన సూచీలు గ్రీన్‌లో. నాస్‌డాక్‌ 0.87 శాతం లాభంతో ముగిసింది. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లన్నీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అయితే నష్టాలు ఒక మోస్తరుగా ఉన్నాయి. ప్రస్తుతం సింగపూర్‌ నిఫ్టి స్వల్ప నష్టంతో ఉంది. హెచ్‌సీఎల్‌ టెక్‌ పనితీరు నిరాశాజనకంగా ఉండటంతో మార్కెట్‌ ఐటీ కౌంటర్లకు ఎలా స్పందిస్తుందో చూడాలి.