For Money

Business News

స్థిరంగా ప్రారంభమైన నిఫ్టి

ఊహించినట్లే నిఫ్టికి 15,850 ప్రాంతంలో ప్రతిఘటన ఎదురైంది. ఈ స్థాయిలో షార్ట్‌ చేసినవారికి పది నిమిషాల్లోనే 60 పాయింట్ల లాభం చేకూరింది. ఓపెనింగ్‌లో 15,844ని తాకిన నిఫ్టి 15,782ని తాకిన తరవాత ఇపుడు 30 పాయింట్ల లాభంతో 15,820 వద్ద నిఫ్టి ట్రేడవుతోంది. నిన్న పొజిషన్‌ తీసుకున్నవారు ఇవాళ లాభాలు స్వీకరించారు. మరి ఇక్కడి నుంచి నిఫ్టి ఎంత వరకు లాభాల్లో కొనసాగుతుందో చూడాలి. ఆశించినట్లు నిఫ్టికి ఐటీ నుంచి మద్దతు లభించలేదు. మెటల్స్‌, ఆటో అండగా నిలిచాయి. బ్యాంక్‌ నిఫ్టి కూడా ఓకే. ఇవాళ అనూహ్యంగా మిడ్‌ క్యాప్‌ షేర్ల సూచీ 0.8 శాతం లాభంతో ట్రేడవుతోంది. రానున్న రెండు వారాలు నిఫ్టి డల్‌గానే ఉండొచ్చు. పైగా కార్పొరేట్‌ ఫలితాలు కూడా గొప్పగా ఉండకపోవచ్చు. కాబట్టి నిఫ్టి 16,000 దాటిన నిలబడటం కష్టంగా కన్పిస్తోంది. మార్కెట్‌ను తీవ్రంగా నిరాశపర్చింది రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌. పెద్ద పెద్ద హెడ్‌లైన్స్‌ షేర్‌ను కాపాడలేకపోయాయి.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
టాటా స్టీల్‌ 1,151.00 3.40
JSW స్టీల్‌ 692.40 1.97
టాటా మోటార్స్‌ 340.30 1.69
ఓఎన్‌జీసీ 123.90 1.56
హిందాల్కో 374.55 1.49

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
రిలయన్స్‌ 2,113.00 -1.88
ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 989.00 -1.16
హిందుస్థాన్‌ లీవర్‌ 2,462.00 -1.13
కొటక్‌ బ్యాంక్‌ 1,726.50 -0.66
ఎన్‌టీపీసీ 117.30 -0.59