For Money

Business News

స్థిరంగా ప్రారంభం కానున్న నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లు నిస్తేజంగా లేదా నష్టాల్లో ఉన్నాయి. నిన్న యూరో మార్కెట్లు మిశ్రమంగా క్లోజ్‌ కాగా, అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. నాస్‌డాక్‌ ఒకశాతంపైగా నష్టంతో ముగిసింది. నిన్న రాత్రి డాలర్‌ ఇండెక్స్‌ 0.7 శాతంపైగా లాభపడింది. దీంతో క్రూడ్‌, బులియన్‌ క్షీణించాయి. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లో ఉన్నాయి. నిక్కీ, తైవాన్‌ కోప్సీ అర శాతంపైగా నష్టంతో ట్రేడువుతున్నాయి. ఇతర సూచీలు నష్టాల్లో ఉన్నా… నామ మాత్రమే. సింగపూర్‌ నిఫ్టి ఒక మోస్తరు నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టి ఇదే స్థాయిలో లేదా స్థిరంగా ప్రారంభం కానుంది. ఆర్‌బీఐ క్రెడిట్‌ పాలసీ సమీక్ష వివరాలను ఇవాళ వెల్లడించనుంది.