For Money

Business News

మిడ్‌ సెషన్‌లో గట్టి మద్దతు

అంతర్జాతీయ మార్కెట్లకు భిన్నంగా మన మార్కెట్లు ముందకు సాగాయి. ఉదయం నుంచి క్లోజింగ్‌లో 15,700 వద్ద నిఫ్టికి గట్టి ప్రతిగటన ఎదురు అవుతోంది. ఇదే స్థాయి వద్ద ఓపెనింగ్‌లో అమ్మినవారికి 100 పాయింట్ల దాకా లాభం దక్కింది. అలాగే దిగువ స్థాయిలో కొన్నవారికీ లాభాలు అదే స్థాయిలో దక్కాయి. ఇవాళ వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ కారణంగా చివర్లో నిఫ్టి భారీ లాభాలు గడిచింది. చివర్లో 15705కు చేరినా … క్లోజింగ్‌లో 15690 వద్ద సెటిలైంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 116 పాయింట్లు పెరిగింది. మిడ్ క్యాప్‌లోనూ ఇదే ట్రెండ్‌ కన్పించింది. నిఫ్టిలో 35 షేర్లు లాభాల్లో ముగిశాయి. నిన్న అమెరికా, ఉదయం ఆసియా, మిడ్‌ సెషన్‌ తరవాత యూరో నష్టాల్లో ఉన్నా… మన మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. రేపు కొత్త వీక్లీ సిరీస్‌ ఎలా ప్రారంభమౌతుందో చూడాలి.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
టైటాన్‌ 1,694.00 6.83
ఓఎన్‌జీసీ 123.65 5.01
ఐషర్‌ మోటార్స్‌ 2,768.00 3.37
ఎల్‌ అండ్‌ టీ 1,512.00 2.78
యాక్సిస్‌ బ్యాంక్‌ 752.25 2.07

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 1,005.85 -2.15
విప్రో 539.00 -0.74
డాక్టర్‌ రెడ్డీస్‌ 5,280.00 -0.61
టాటా స్టీల్‌ 1,117.55 -0.58
బజాజ్‌ ఆటో 4,271.05 -0.56