For Money

Business News

నిఫ్టి: 15,700 స్థాయిని తాకేనా?

నిఫ్టి ప్రతిఘటన ఆరంభంలోనే ఎదురైంది. ఓపెనింగ్‌లో 15,693 స్థాయిని తాకిన నిఫ్టి ఇపుడు 15,656 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 80 పాయింట్లు లాభపడింది. గత కొన్ని రోజులుగా నిఫ్టిని కొనుగోలు చేసినవారు ఈ స్థాయిలో లాభాల స్వీకరించడం ఉత్తమమని టెక్నికల్‌ అనలిస్ట్‌ మితేష్‌ టక్కర్‌ సీఎన్‌బీసీ టీవీ18 ప్రేక్షకులకు సలహా ఇచ్చారు. నిఫ్టి ఈ స్థాయి నుంచి ఏమాత్రం పెరిగినా.. అమ్మడానికి ఛాన్స్‌గా అనలిస్టులు సూచిస్తున్నారు. నిఫ్టికి తదుపరి ప్రతిఘటన 15,714 వద్ద ఎదురు కానుంది. దీన్ని స్టాప్‌లాస్‌గా పెట్టుకుని నిఫ్టిని అమ్మడం బెటర్‌ అని వీరు సూచిస్తున్నారు. నిఫ్టిలో ప్రస్తుతం 43 షేర్లు లాభాల్లో ఉండగా ఆరు షేర్లు నష్టాల్లో ఉన్నాయి. మార్కెట్‌కు మెటల్స్‌ నుంచి మద్దతు లభిస్తోంది. బ్యాంక్‌ నిఫ్టి నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు అందలేదు. నిన్న భారీగా లాభపడిన మిడ్‌ క్యాప్‌ షేర్ల సూచీ ఇవాళ కూడా 0.7 శాతం లాభంతో ట్రేడవుతోంది. ఇవాళ వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ ఉంది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
టైటాన్‌ 1,634.85 3.10
అదానీ పోర్ట్స్‌ 823.90 1.53
రిలయన్స్‌ 2,234.00 1.49
ఓఎన్‌జీసీ 119.45 1.44
టాటా మోటార్స్‌ 326.55 1.10

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
బజాజ్‌ ఆటో 4,272.65 -0.52
టెక్‌ మహీంద్రా 1,012.85 -0.40
నెస్లే ఇండియా 17,593.60 -0.34
సిప్లా 952.50 -0.23
బ్రిటానియా 3,471.10 -0.12