For Money

Business News

వడ్డీ రేట్లలో మార్పు ఉండకపోవచ్చు

వరుసగా ఆరోసారి ఆర్బీఐ వడ్డీ రేట్లను మార్చకుండా వొదిలేసే అవకాశముంది.ఆర్‌బీఐ పరపతి విధానం సమీక్ష వివరాలను ఇవాళ ఆర్బీఐ గవర్నర్‌ ఇవాళ ప్రకటించనున్నారు.కీలక వడ్డీ రేట్ల జోలికి ఆర్బీఐ వెళ్ళకపోవచ్చని మార్కెట్‌ అనలిస్టులు, బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నారు. ద్రవ్యోల్బణం పెరుగుతున్న సంకేతాలు ఉన్నా… ఆర్బీఐ యధాతథ స్థితి కొనసాగించేందుకు ప్రాధాన్యం ఇవ్వొచ్చు. కరోనా నుంచి ఆర్థిక వ్యవస్థను వృద్ధిబాటలోకి తేవడానికే ఆర్బీఐ ప్రాధాన్యం ఇవ్వనుంది. మున్ముందు జీడీపీ, ద్రవ్యోల్బణంపై ఆర్‌బీఐ గవర్నర్‌ చేసే కామెంట్ల కోసం స్టాక్‌ మార్కెట్‌ కూడా ఎదురు చూస్తోంది. కోవిడ్‌ వల్ల దెబ్బతిన్న రంగాలకు ఆర్బీఐ ఏమైనా ఉపశమనం కల్గించే చర్యలు ప్రకటిస్తుందేమో చూడాలి.