For Money

Business News

షేర్‌ మార్కెట్‌ బుడగ పేలుతుంది జాగ్రత్త

గత ఆర్థిక సంవత్సరంలో అంటే 2020-21లో జీడీపీ వృద్ధి రేటు మైనస్‌ 8 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నాం. ఇలాంటి సమయంలో షేర్‌ మార్కెట్‌లో ధరలు పెరగడం చూస్తుంటే… రిస్క్‌ బుడగ ఎపుడైనా పేలుతుందని ఆర్బీఐ హెచ్చరించింది. కరోనా తరవాత అనేక దేశాలు ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించాయి. దీంతో రిస్క్‌ ఉన్న ఆస్తుల ధరలు గణనీయంగా అంతర్జాతీయంగా పెరుగుతున్నాయి. అభివృద్ధి మళ్ళీ ప్రారంభం కావడం, వ్యాక్సిన్లు రావడం, అలాగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనిశ్చితి తొలగడంతో రిస్క్‌ ఆస్తులు ధరలు బాగా పెరిగాయి. అయితే వాస్తవ ఎకనామీ రికవరీకి, ధరలకు మధ్య వ్యత్యాసం బాగా పెరుగుతోందని ఆర్బీఐ హెచ్చరించింది. షేర్‌ మార్కెట్‌లో బుడగకు హేతుబద్ధత ఉందా అన్న అంశంపై ఆర్బీఐ తయారు చేసిన ఓ నోట్‌లో ఈ అంశాలను ప్రస్తావించింది. దేశీయంగా లిక్విడిటీ బాగుండటం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టబడులతో షేర్‌ మార్కెట్‌ సూచీలు పెరుగుతున్నాయని ఆర్బీఐ పేర్కొంది. అయితే ఈ రెండు అంశాల ప్రభావం ఆర్థికవృద్ధి రేటుపై తక్కువ అని తెలిపింది.