For Money

Business News

గ్రీన్‌లో ప్రారంభం కానున్న నిఫ్టి

షేర్‌ మార్కెట్లలో బుల్‌ రన్‌ కొనసాగుతోంది. డాలర్‌ ఇండెక్స్‌ మళ్ళీ 90ని దాటింది. జాబ్‌ క్లయిమ్స్‌ తగ్గినా అమెరికా మార్కెట్ల పెద్ద ఉత్సాహం కన్పించలేదు. నాస్‌డాక్‌ స్థిరంగా క్లోజ్‌ కాగా, నామ మాత్రపు లాభాలతో ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ ముగిసింది. డౌజోన్స్‌ 0.41 శాతం లాభంతో క్లోజైంది. కాని ఈ మార్కెట్లకు భిన్నంగా ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. జపాన్‌ నిక్కీ ఏకంగా రెండు శాతంపైగా లాభంతో ట్రేడవుతోంది.చైనా డల్‌గా ఉంది.కొన్ని సూచీలు డల్‌గా ఉనాయి. అయితే హాంగ్‌సెంగ్‌ అర శాతం వరకు లాభంతో ట్రేడవుతోంది. తైవాన్‌ ఒక శాతంపైగా లాభంతో ఉంది. సింగపూర్‌ నిఫ్టి 40 పాయింట్ల లాభంతో ప్రస్తుతం ట్రేడవుతోంది. ఈనేపథ్యంలో నిఫ్టి గ్రీన్‌లో ప్రారంభం కావడం ఖాయంగా కన్పిస్తోంది.