For Money

Business News

నిఫ్టి… చివర్లో షార్ట్‌కవరింగ్‌…

ఇవాళ కూడా నిన్నటి మాదిరి నిఫ్టి వంద పాయింట్ల వ్యత్యాసంతో కదలాడింది. వెరశి ఓపెనింగ్‌ చోటే క్లోజైంది. క్రితం ముగింపుతో పోలిస్తే 36 పాయింట్ల లాభంతో నిఫ్టి 15,337 వద్ద ముగిసింది. కాని స్వ్కేర్‌ ఆఫ్‌కు ముందు ఇవాళ్టి కనిష్ఠ స్థాయి 15,272ని తాకింది. డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ కారణంగా వచ్చిన షార్ట్‌ కవరింగ్‌తో ఏకంగా 100 పాయింట్లకు పైగా పెరిగి 15,384కు చేరినా… క్షణాల్లో 50 పాయింట్లు తగ్గింది. అయినా నిఫ్టి 15,300పైనే ముగియడం విశేషం. నిఫ్టి పడినపుడు అంటే రెడ్‌జోన్‌లోకి వెళ్ళినపుడు కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు ఒక మోస్తరు లాభాలు వచ్చాయి. ఫార్మా తప్ప మిగిలిన అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ, బ్యాంకు షేర్లు నిఫ్టికి అండగా నిలిచాయి. మిడ్‌ క్యాప్‌ షేర్లు సూచీ 0.7 శాతం లాభంతో ముగిసింది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
శ్రీసిమెంట్‌ 28,192.85 4.12
ఎస్‌బీఐ 426.50 3.13
బజాజ్‌ ఆటో 4,259.00 2.22
కొటక్‌ బ్యాంక్‌ 1,776.85 2.08
టెక్‌ మహీంద్రా 1,028.30 2.03

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
హెచ్‌డీఎఫ్‌సీ 2,499.10 -2.67
ఓఎన్‌జీసీ 111.65 -1.50
ఐఓసీ 110.40 -1.43
బజాజ్‌ ఫైనాన్స్‌ 5,689.80 -1.41
భారతీ ఎయిర్‌టెల్‌ 519.90 -1.11