For Money

Business News

షార్ట్‌ పొజిషన్స్‌ రోలోవర్‌

జులై నెల చాలా నిరాశాజనకంగా ప్రారంభమైంది. డెరివేటివ్స్‌లో నిన్న జూలై రోలోవర్స్‌ చాలా తక్కువగా ఉంది. గత మూడు నెలల సగటు 92 శాతం కాగా, నిన్న రోలోవర్స్ 75 శాతం మాత్రమే ఉన్నాయి. పైగా చాలా షార్ట్‌ పొజిషన్స్‌ రోలోవర్‌ కొనసాగడం చూస్తుంటే నిఫ్టి మరింత పతనం ఖాయంగా కన్పిస్తోంది. నిఫ్టికి తక్షణ మద్దతు 15200 వద్ద ఉందని, ఈ స్థాయిని కోల్పోతే మాత్రం నిఫ్టటి 17450ని చేరుతుందని అనలిస్టులు అంటున్నారు. జూన్‌ సిరీస్‌లో నిఫ్టి 2.4 శాతం క్షీణించింది. విదేశీ ఇన్వెస్టర్లు ప్రతిరోజూ నికర అమ్మకాలు చేస్తుండటంతో మార్కెట్‌పై ఒత్తిడి పెరుగుతోంది. ఎఫ్‌ఎంసీజీ, ఆటోలలో కాస్త ఆసక్తి కన్పిస్తున్నా… బ్యాంక్‌, మెటల్స్‌ రంగంలో ఒత్తిడి ఈ నెల కూడా కొనసాగనుంది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో నిఫ్టి 9.5 శాతం క్షీణించింది.