For Money

Business News

వయాకామ్‌లో రూ. 13,500 కోట్ల పెట్టుబడి

భారత్ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ఓ గొప్ప డీల్‌ ఇవాళ జరిగింది. తన మీడియా సామ్రాజ్యంలోకి స్టార్‌ గ్రూప్‌కు ఆహ్వానం పలికారు. తనకు మెజారిటీ వాటా ఉన్న వయాకామ్‌ 18లో బోధి ట్రీ సిస్టమ్స్‌ భారీ పెట్టుబడికి రిలయన్స్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. స్టార్‌ ఇండియా మాజీ సీఈఓ ఉదయ్‌ శంకర్‌, జేమ్స్‌ మర్డోక్‌లకు చెందిన లుపా సిస్టమ్స్‌లు కలిపి పెట్టిన కంపెనీనే బోధి ట్రీ సిస్టమ్స్‌. వయాకామ్‌ 18లో బోధి ట్రీ సిస్టమ్స్‌ వ్యూహాత్మక ఇన్వెస్టర్‌గా వాటా తీసుకుంది. దేశపు అతి పెద్ద ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లాట్‌ ఫామ్‌ను ఏర్పాటు చేయడంతో పాటు స్ట్రీమింగ్‌ ఫప్ట్‌ మార్కెట్‌కు అవసరమయ్యే కంటెంట్‌ అభివృద్ధికి ఇక వయాకామ్‌ కృషి చేస్తుంది. వయాకామ్‌18కు కలర్స్‌ పేరుతో ఎంటర్‌టైన్‌మెంట్‌, న్యూస్‌ ఛానల్స్‌తోపాటు వూట్‌ పేరుతో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ కూడా ఉంది. వీరి పెట్టుబడికి తోడు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్‌ ప్రాజెక్ట్స్‌ అండ్‌ ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ కంపెనీ కూడా మరో రూ. 1645 కోట్ల పెట్టుబడి పెడుతుంది. అలాగే జియో సినిమా ఓటీటీ యాప్‌ను వయాకామ్‌ 18 పారామౌంట్‌ గ్లోబల్‌కు బదిలీ చేస్తుంది. వయాకామ్‌లో ఇపుడు ముగ్గురికి భాగస్వామ్యం ఉంటుందన్నమాట. రిలయన్స్‌, బోధి ట్రీ సిస్టమ్స్‌, వయాకామ్‌ 18 పారామౌంట్‌ గ్లోబల్‌. ఈ డీల్‌ గురించి రిలయన్స్‌ అధినేత ముకేష్‌ అంబానీ మాట్లాడుతూ… మన దేశం, ఆసియాతో పాటు ప్రపంచ మీడియా రంగంలో ఉదయ్‌ శంకర్‌, జేమ్స్‌ మర్డోక్‌లకు దాదాపు రెండు దశాబ్దాల అనుభవం ఉందని.. వీరి ఆధ్వర్యంలో స్ట్రీమింగ్‌ ఫస్ట్‌ మీడియా మార్కెట్‌లోఅనూహ్య మార్పు వస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు.