For Money

Business News

యాపిల్ ఫోన్‌… నో స్టాక్‌

అమెరికాలో ఇవాళ బ్లాక్‌ ఫ్రై డే అమ్మకాలు ప్రారంభమయ్యాయి. క్రిస్మస్ పండుగ సెలవుల సీజన్‌ ఇప్పటికే అమెరికాలో ప్రారంభమైంది. అనేక వ్యాపారాలు డల్‌గా ఉన్నాయి. స్టాక్‌ మార్కెట్‌లో ట్రేడింగ్‌ లావాదేవీలు కూడా అంతంత మాత్రమే ఉంటున్నాయి. అయితే రీటైల్‌ షాపులు మాత్రం కిక్కిరిసి పోతున్నాయి. భారీ డిస్కౌంట్‌ల ఆఫర్‌ చేసే బ్లాక్‌ ఫ్రై డే రోజున అనేక స్టోర్లలో యాపిల్‌ ఫోన్లు లభించడం లేదన్న వార్త ఇపుడు హాట్‌ టాపిక్‌గా మారింది. చైనాలో యాపిల్‌ ఫోన్లను తయారు చేసే ఫాక్స్‌కాన్‌ ప్లాంట్‌లో ఉద్యోగులు ఆందోళనకు దిగడంతో… ఉత్పత్తిపై ప్రభావం చూపింది. దీంతో అమెరికాలో అనేక చోట్ల యాపిల్‌ ఫోన్లు లేవని వార్తలు వస్తున్నాయి. చాలా తక్కువ స్టాక్స్‌తో ఈ సీజన్‌ ప్రారంభమైనట్లు సమాచారం. సరఫరా పెంచేందుకు కంపెనీ చర్యలు తీసుకున్నా.. చైనా నుంచి స్టాక్‌ వస్తే గాని… సరఫరా చేయలేని పరిస్థితి. పలు చోట్ల ఫోన్లు ఉన్న… కస్టమర్లు అడిగే మోడల్స్‌ ఉండటం లేదని అంటున్నారు. ముఖ్యంగా ఐఫోన్‌ 14 ప్రొ మోడల్‌కు విపరీతమైన డిమాండ్‌ ఉందని, దానికి తగ్గట్లు సరఫరా లేదని రీటైల్‌ స్టోర్స్‌ అంటున్నాయి.