For Money

Business News

పబ్లిక్‌ ఇష్యూకు విరాట్‌ కోహ్లి కంపెనీ

భారత స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్‌కు గో డిజిట్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ లిమిటెడ్‌కు ఇన్సూరెన్స్‌ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ అనుమతి ఇచ్చింది. క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ, ఆయన భార్య అనుష్క శర్మలు ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టారు. గత ఆగస్టులో ఈ కంపెనీ సెబి వద్ద కూడా ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. అయితే పబ్లిక్‌ ఆఫర్‌ ఎందుకు కారణం చెప్పలేదని పెండింగ్‌లో పెట్టింది. అయితే ప్రమోటర్లు కొంత వాటాను అమ్మడంతో పాటు తాజాగా కొత్త ఈక్విటీ షేర్ల జారీ కూడా ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఓఎఫ్‌ఎస్‌ కింద గో డిజిట్‌ ఇన్ఫోవర్క్స్‌ సర్వీసెస్‌ 10.94 కోట్ల షేర్లను విక్రయించనుంది. కొత్త ఈక్విటీ ద్వారా రూ. 1250 కోట్లను సమీకరించనుంది. ఇష్యూకు ముందు రూ. 250 కోట్ల విలువైన షేర్లను ప్లేస్‌మెంట్‌ చేయనున్నారు. ఇదే జరిగితే ఆ మేరకు ఇష్యూ నుంచి షేర్లను తగ్గిస్తారు. ఈ ఇష్యూ ద్వారా సమీకరించే నిధుల కంపెనీ మూలధనం పెంచుకోవడానికి, ఇతర వ్యాపార కార్యకలాపాలకు వినియోగిస్తారు. విరాట్‌ కోహ్లి, అనుష్కా శర్మ తమ షేర్లను ఈ ఆఫర్‌ ద్వారా అమ్ముతారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.