For Money

Business News

ముగింపులో నిఫ్టి కొత్త రికార్డు

జూన్‌ నెల డెరివేటివ్స్‌ మంచి ప్రారంభాన్ని ఇచ్చింది. ఐటీ, ఫార్మి మినహా అన్ని రంగాల నుంచి గట్టి మద్దతు అందింది. ముఖ్యంగా మెటల్స్‌లో వచ్చిన కొనుగోళ్ళలో నిఫ్టి ఆల్‌టైమ్‌ హైలో ముగిసింది. ఉదయం నుంచి నిఫ్టి గ్రీన్‌లోనే కొనసాగింది. యూరో మార్కెట్లు కూడా గ్రీన్‌లో ప్రారంభం కావడంతో నిఫ్టికి కలిసి వచ్చింది. క్రమంగా పెరుగుతున్న క్రూడ్‌ ధరలు, బలపడుతున్న డాలర్‌ను మార్కెట్‌ పట్టించుకోలేదు. నిఫ్టి క్రితం ముగింపుతో పోలిస్తే 98 పాయింట్ల లాభంతో 15,435 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టి మిడ్‌క్యాప్‌ సూచీ ఈ స్థాయిలో లాభపడకపోయినా.. గ్రీన్‌లోనే ముగిసింది. ఫలితాలు నిరాశాజనకంగా ఉండటంతో సన్‌ ఫార్మాతో పాటు ఇతర ఫార్మా కౌంటర్లలో అమ్మకాల ఒత్తిడి వచ్చింది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
రిలయన్స్‌ 2,094.45 5.99
అదానీ పోర్ట్స్‌ 777.00 3.41
గ్రాసిం 1,465.00 3.38
ఎం అండ్‌ ఎం 847.00 2.22
కోల్‌ ఇండియా 147.10 1.76

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
సన్‌ ఫార్మా 672.65 -3.84
శ్రీ సిమెంట్‌ 27,599.00 -1.66
బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ 11,725.00 -1.38
డాక్టర్‌ రెడ్డీస్‌ 5,200.00 -1.31
బజాజ్‌ ఫైనాన్స్‌ 5,616.00 -1.17