For Money

Business News

మళ్ళీ పెరిగిన పెట్రో ధరలు

అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆపిన పెట్రోల్‌ ధరల పెంపు ఎఫెక్ట్‌తో వరుసగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచిన ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ఇపుడు అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరుగుతున్నాయని ధరలు పెంచుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ పన్నులు తగ్గించే యోచన చేయడం లేదు. ఇవాళ కూడా ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు పెట్రోల్‌ ధర 29 పైసలు, డీజిల్‌ ధరను 28పైసలు పెంచాయి. దీంతో 23 రోజుల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.5.53, డీజిల్‌ ధర రూ.5.97 చొప్పున పెరిగాయి. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌ పెట్రోల్‌ ధర రూ. 104 దాటింది. ఇక డీజిల్‌ ధర రూ. 95.35కు చేరింది. ముంబైలో డీజిల్‌ ధర రూ. 94.15కు చేరగా, పెట్రోల్‌ ధర రూ. 101.04కు చేరింది.