For Money

Business News

స్థిరంగా ప్రారంభం కానున్న నిఫ్టి

అంతర్జాతీయ మార్కట్లు మిశ్రమంగా ఉన్నాయి. నిన్న అమెరికాలో సీపీఐ ద్రవ్యోల్బణం పెరిగినా మార్కెట్లు గ్రీన్‌లో ముగిశాయి. డౌజోన్స్‌ స్థిరంగా ముగిసినా… నాస్‌డాక్‌ 0.78 శాతం పెరగ్గా, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 0.47 శాతం లాభంతో క్లోజైంది. ఎస్‌ అండ్‌ పీ 500 ఆల్‌టైమ్‌ హైలో క్లోజ్‌ కావడం విశేషం. అంతక్రితం యూరో మార్కెట్లు కూడా మిశ్రమంగా ముగిశాయి. ఇక ఆసియామార్కెట్ల విషయానికొస్తే. చైనా మార్కట్లు ఒక మోస్తరు నష్టాలతో ఉన్నాయి. అయితే హాంగ్‌సెంగ్‌ అరశాతంపైగా లాభం ఉంది. జపాన్‌ నిక్కీ స్థిరంగా ఉంది. సింగపూర్‌ నిఫ్టి స్వల్ప లాభాలతో ట్రేడవుతోంద. ఈ లెక్కన నిఫ్టి స్థిరంగా లేదా స్వల్ప లాభాలతో ప్రారంభం కావొచ్చు.