For Money

Business News

నిఫ్టిని అధిక స్థాయిలో అమ్మడమే

అమెరికా నుంచి వస్తున్న వార్తలు మార్కెట్‌కు నెగిటివ్‌గా ఉన్నాయి. స్వల్ప కాలానికి పెద్ద మార్పులు లేకున్నా.. మధ్యకాలానికి మార్కెట్‌ ఒత్తిడి ఖాయంగా కన్పిస్తోంది. రాత్రి అమెరికా ద్రవ్యోల్బణ రేటు పెరగడంతో పాటు ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో ఉద్దీపన ప్యాకేజీని అమెరికా ఆపేయొచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పొజిషనల్‌ ట్రేడర్స్‌ జాగ్రత్తగా ఉండటం బెటర్‌. ఇక డే ట్రేడర్స్‌ ఎప్పటిపుడు లెవల్స్‌ చూసుకుని ట్రేడ్‌ చేయడమే. నిన్న వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ కారణంగా నిఫ్టి ఆకర్షణీయ లాభంతో ముగిసింది. నిన్న ముగింపు 15,737. నిఫ్టి ఇవాళ స్వల్ప లాభంతో ప్రారంభం కావొచ్చు. ఇవాళ్టికి నిఫ్టికి కీలకస్థాయి 15710. ఈ స్తాయికి వచ్చాక.. పుంజుకుంటుందేమో చూడండి. ఒకవేళ నిఫ్టికి ఈ స్థాయిలో లేదా 15,690 వద్ద మద్దతు అందుతుందేమో చూడండి. స్టాప్‌ లాస్‌ 15,670. ఈ స్థాయిని దాటి 15,660 దిగువకు వస్తే నిఫ్టి 15600 స్థాయికి రావడం ఖాయం. ఒకవేళ నిఫ్టికి 15710 లేదా 15,690 ప్రాంతంలో మద్దతు లభిస్తే 15,780ని చేరే అవకాశముంది. ఆ తరవాత 15,820 వద్ద గట్టి ప్రతిఘటన ఎదురు కావొచ్చు. సో 15,700 నుంచి 15,800 మధ్య నిఫ్టి కదలాడే అవకాశముంది.

మార్కెట్‌ ఓపెనింగ్‌ రివ్యూలో నిఫ్టి తాజా పరిస్థితిపై కామెంట్‌