For Money

Business News

భారీ నష్టాల్లో వాల్‌స్ట్రీట్‌, యూరో

మార్కెట్లు ప్రారంభం నుంచి స్వల్ప నష్టాల్లో ఉన్న యూరో మార్కెట్లు ఒక్కసారి కుప్పకూలాయి. ప్రధాన సూచీలన్నీ 1.5 శాతం నుంచి 2 శాతం వరకు నష్టంతో ట్రేడవుతున్నాయి. కాస్సేటి క్రితం ప్రారంభమైన అమెరికా మార్కెట్లు కూడా భారీ నష్టాల్లో ఉన్నాయి. డౌ జోన్స్‌ 1.35 శాతం నష్టంతో ట్రేడవుతుండగా, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 0.9 శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఇక నాస్‌డాక్‌ కూడా 0.5 శాతం నష్టంతో ట్రేడవుతోంది.అమెరికా సెయింట్‌ లూయీస్‌ ఫెడరల్ రిజర్వ్‌ బ్యాంక్‌ అధ్యక్షుడు జేమ్స్‌ బుల్లర్డ్‌ కామెంట్స్‌తో మార్కెట్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ద్రవ్యోల్బణం ఊహించినదానికన్నా ఎక్కువగా ఉందని, ఉద్దీపన ప్యాకేజీని తగ్గించేందుకు కేంద్ర ఫెడరల్‌ బ్యాంక్‌ పలు మార్లు భేటీ కావాల్సి వస్తుందని ఆయన అన్నారు. బుల్లర్డ్‌ కామెంట్స్‌తో ఒక్కసారి కరెన్సీ మార్కెట్‌లో డాలర్‌ బలపడింది. డాలర్‌ ఇండెక్స్‌ ఒక్కసారిగా 0.42 శాతం పెరిగింది. విచిత్రమేమిటంటే… ఆయిల్‌ ఉత్పత్తి 2022 వరకు పెరిగే ప్రసక్తే లేదని వార్తలు రావడంతో క్రూడ్‌ 1.5 శాతం లాభంతో ట్రేడవుతోంది. ఒకవైపు డాలర్‌, మరోవైపు క్రూడ్‌ పెరగడంతో భారత్‌ వంటి వర్ధమాన దేశాల కష్టాలు మరింత పెరిగినట్లే.