For Money

Business News

భారీ నష్టాల్లో ఆసియా మార్కెట్లు

అమెరికా ద్రవ్బోల్బణం ప్రపంచ మార్కెట్లను దెబ్బతీస్తోంది. ఫెడ్‌ సమావేశం తరవాత అమెరికాలో ద్రవ్యోల్బణంపై చర్చ పెరిగింది. గత శుక్రవారం ఫెడ్‌ రిజర్వ్‌ అధికారులు చేసిన కామెంట్లతో మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. గత శుక్రవారం అమెరికా మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. డౌజోన్స్‌ 1.58 శాతం, ఎస్‌ అండ్‌ పీ 1.31 శాతం, నాస్‌డాక్‌ సూచీ 0.9 శాతం క్షీణించాయి. అంతకుముందు యూరో మార్కెట్లు కూడా భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి మరింత పెరిగింది. జపాన్‌ నిక్కీ ఏకంగా మూడున్నర శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఇతర సూచీలు ఒకటి నుంచి రెండు శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. చైనా ఒక్కటే స్థిరంగా ఉంది. హాంగ్‌సెంగ్‌ కూడా 0.7 శాతం నష్టంతో ట్రేడవుతోంది. సింగపూర్‌ నిఫ్టి దాదాపు 200 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టి కూడా ఇదే స్థాయి నష్టంతో ప్రారంభం కావొచ్చు. గత శుక్రవారం నిఫ్టి దాదాపు స్థిరంగా ముగిసింది. కాని మిడ్‌ క్యాప్‌ షేర్ల సూచీ ఒక శాతంపైగా నష్టపోయింది. బలపడిన డాలర్‌తో పాటు క్రూడ్‌ ధరలు పెరగడం భారత మార్కెట్లకు పెద్ద మైనస్‌ పాయింట్‌.