For Money

Business News

నిఫ్టి…. పెరిగితే అమ్మడమే

బుల్‌ రన్‌కు బ్రేక్‌ పడినట్లే కన్పిస్తోంది. పడటానికి ప్రపంచ షేర్‌ మార్కెట్లు ఏదో ఒక సాకు కోసం వెతుకుతున్నాయి. ప్రతి చిన్న నెగిటివ్‌ అంశానికి రియాక్టవుతున్నాయి. గత శుక్రవారం నిఫ్టిని కావాలని ఆపరేటర్లు గ్రీన్‌లో ఉంచారు. మార్కెట్‌లోభారీ అమ్మకాల ఒత్తిడి వచ్చినా నిఫ్టిని మాత్రం కాపాడుతున్నారు. కాని ప్రపంచ మార్కెట్లో వస్తున్న పరిణామాలను చూస్తుంటే నిఫ్టిని కాపాడటం కష్టంగా కన్పిస్తోంది. మెటల్స్‌లో బుల్‌రన్‌కు బ్రేక్‌ పడింది. ఈ నేపథ్యంలో మార్కెట్‌ను ఏ రంగం ముందుకు తీసుకెళుతుందో చూడాలి. ఇవాళ్టికైతే.. డే ట్రేడర్స్‌ ఓపెనింగ్‌లో కొనుగోలు చేసినా… స్వల్ప లాభాలకే బయటపడమని అనలిస్టులు సలహా ఇస్తున్నారు. నిఫ్టి క్రితం ముగింపు 15,683. సింగపూర్‌ నిఫ్టి 200 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. అంటే నిఫ్టి 15,500-15,550 మధ్య ప్రారంభం కానుంది. రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్లు ఇక్కడ కొనుగోలు చేసి స్వల్ప లాభాలతో బయటపడొచ్చు. 15,500 స్థాయికి దిగువకు వస్తే మార్కెట్‌కు దూరంగా ఉండండి. 15,500-15,550 స్థాయి నుంచి నిఫ్టి కోలుకుని 15,582ని దాటితే మరి కొంత లాభం పొందే అవకాశముంది. 15,632 వద్ద నిఫ్టికి ప్రతిఘటన ఎదురు కానుంది. దిగువ స్థాయిలో కొనుగోలు చేసినవారు ఇక్కడే అమ్మొచ్చు. రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్లు ఇక్కడే అమ్మొచ్చు. స్టాప్‌లాస్‌ 15650. ఏ కారణం వల్లనైనా నిఫ్టి 15,650ని దాటితే మార్కెట్‌కు దూరంగా ఉండండి. 15,600పైన డే ట్రేడర్స్‌ కొనుగోలు చేయొద్దు.