For Money

Business News

ప్రధాన మద్దతు స్థాయికి దిగువన నిఫ్టి

ఉదయం ఒక మోస్తరు నష్టాలతో ప్రారంభమైన నిఫ్టి… రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. మిడ్ సెషన్‌ తరవాత కాస్త మద్దతు అందినా… మూడు గంటల ప్రాంతంలో అంటే స్క్వేర్‌ ఆఫ్‌ సమయంలో కీలక మద్దతు స్థాయిని కోల్పోయింది. ఎట్టకేలకు ప్రధాన మద్దతు స్థాయిపై క్లోజ్‌ కావడం విశేషమే. ఉదయం 14,824ను తాకిన నిఫ్టి … ఆ తరవాత ఆ స్థాయికి చేరలేదు. సెషన్‌ ముగియడానికి అరగంట ముందు నిఫ్టి ఇవాళ్టి కనిష్ఠ స్థాయి 14695ని తాకింది. మొత్తానికి 96 పాయింట్ల నష్టంతో 14,754 వద్ద ముగిసింది. నిఫ్టి తక్షణ మద్దతు 14760 కాగా, రెండో ప్రధాన మద్దతు స్థాయి 14,720 ఈ రెండింటిని ఇవాళ బ్రేక్‌ చేసినా 14,750పైన ముగిసింది. బ్యాంక్‌ నిఫ్టిలో ఇవాళ కూడా అమ్మకాల ఒత్తిడి వచ్చింది. ప్రభుత్వం షేర్ల అండతో గత కొద్ది రోజులుగా సూచీలు మరీ భారీగా పడిపోకుండా సాగుతున్నాయి. మిడ్‌ సెషన్‌లో యూరో షేర్లు గ్రీన్‌లో ఉన్నా, నష్టాల సూచీలు అదే స్థాయిలో ఉన్నాయి. యూరో స్టాక్స్‌ 50 క్రితం స్థాయి వద్దే ట్రేడవుతోంది. డాలర్‌ స్వల్పంగా పెరిగింది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
టాటా మోటార్స్‌ 332.65 5.42 పవర్‌ గ్రిడ్‌ 228.30 2.19
ఎన్‌టీపీసీ 115.00 2.04
యూపీఎల్‌ 698.30 2.04
ఎస్‌బీఐ 371.85 1.97

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
హిందుస్థాన్‌ లీవర్‌ 2,328.05 -3.08
ఎస్‌బీఐ లైఫ్‌ 977.95 -2.30
శ్రీసిమెంట్‌ 26,900.00 -2.23
ఐసీఐసీఐ బ్యాంక్‌ 597.80 -1.98
ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 930.95 -1.89