For Money

Business News

నిఫ్టి పడితే.. కొనండి

నిఫ్టి ఇవాళ 15300పైన ప్రారంభమయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. నిఫ్టికి ప్రధాన నిరోధ స్థాయి కూడా ఇదే. తరువాతి నిరోధ స్థాయి 15400. స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు అంచనా ప్రకారం నిఫ్టి ఆల్‌టైమ్‌ హైని టచ్‌ చేయనుంది. మరి అక్కడి నుంచి ముందుకు వెళుతుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఎందుకంటే జూన్‌ నెలలో ప్రీమియ్‌లు శుక్రవారం నిర్ణయించనున్నాయి. అలాగే రోల్‌ఓవర్స్‌ కూడా. డే ట్రేడర్స్‌ ఇవాళ నిఫ్టి క్షీణిస్తుందేమో వెయిట్‌ చేయడం మంచిది. ఓపెనింగ్‌లో కొనుగోలు చేయడం కన్నా… దిగువ స్థాయిలో ఎంటర్‌కావడం మంచిది. మరి నిఫ్టి ఇవాళ ఆ ఛాన్స్‌ ఇస్తుందా అన్నది చూడాలి. మార్కెట్‌ ట్రెండ్‌ మాత్రం బుల్లిష్‌గా ఉంటుందని అనలిస్టులు అంటున్నారు. డే ట్రేడింగ్‌ లేదా పొజిషనల్‌ ట్రేడింగ్‌ అయినా… స్టాప్‌లాస్‌ కచ్చితంగా పాటించండి. ఎందుకంటే విదేశీ ఇన్వెస్టర్లు వరుసగా అమ్ముతూనే వస్తున్నారు. బీ కేర్‌ ఫుల్‌.