For Money

Business News

నష్టాలు పూడ్చుకున్న నిఫ్టి

ఉదయం నుంచి నష్ఠాల్లో ట్రేడైన నిప్టి చివరి 45 నిమిషాల్లో నష్టాలన్నింటిని పూడ్చుకుని గ్రీన్‌లో ముగిసింది. క్రితం ముగింపు స్థాయిలోనే 15,576 పాయింట్ల వద్ద ముగిసింది. ఉదయం అంచనా వేసినట్లు నిఫ్టికి దిగువ స్థాయిలో మద్దతు అందింది. ఉదయం అమ్మినవారికి మిడ్‌ సెషన్‌లో లాభాలు వచ్చాయి. 15,450 స్టాప్‌లాస్‌తో కొన్నివారికి కూడా ఆకర్షణీయ లాభాలు దక్కాయి. అయితే ఇవాళ ట్రేడింగ్‌… నాన్‌ నిఫ్టి షేర్లలో జరిగింది. నిఫ్టి నెక్ట్స్‌ 50 సూచీ 1.84 శాతం పెరగ్గా, మిడ్‌ క్యాప్ షేర్ల సూచీ 1.62 శాతం లాభంతో ముగిసింది. ఫలితాలు నిరాశాజనకంగా ఉండటంతో ఐటీసీ షేర్‌ రూ.210లోపు ముగిసింది. మిడ్ సెషన్‌ తరవాత అనూహ్యంగా మెటల్‌ కౌంటర్లలో వచ్చిన మద్దతుతో నిఫ్టి కోలుకుంది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
యూపీఎల్‌ 838.50 2.78
టాటా స్టీల్‌ 1,129.55 2.60
హిందాల్కో 402.05 1.86
JSW స్టీల్‌ 707.00 1.80
రిలయన్స్‌ 2,207.00 1.76

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
ఐటీసీ 209.05 -2.88
టెక్‌ మహీంద్రా 1,017.80 -1.23
యాక్సిస్‌ బ్యాంక్‌ 737.55 -1.02
ఏషియన్‌ పెయింట్స్‌ 2,906.00 -0.85
హెచ్‌డీఎఫ్‌సీ 2,562.30 -0.71