For Money

Business News

నష్టాలతో ప్రారంభమైన నిఫ్టి

ఊహించినట్లే నిఫ్టి నిన్నటి కనిష్ఠ స్థాయి వద్ద ప్రారంభమైంది. తరవాత స్వల్పంగా తగ్గి 15,519ని తాకినా.. వెంటనే కోలుకుని 15,552 వద్ద 23 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టిని ఐటీసీ దెబ్బతీసింది. నిఫ్టి మళ్ళీ 15,500 ప్రాంతానికి వస్తుందేమో చూడాలి. బ్యాంక్‌ నిఫ్టి ఇవాళ కూడా నష్టాల్లో ఉంది. ఫైనాన్షియల్స్‌ కూడా. మిడ్‌ క్యాప్‌ షేర్ల సూచీ గ్రీన్‌లో ఉంది. నిఫ్టి నెక్ట్స్‌ 50 సూచీ దాదాపు ఒక శాతం లాభపడటం విశేషం. నిఫ్టిలో 25 షేర్లు లాభాల్లో ఉండగా, 25 షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
ఓఎన్‌జీసీ 119.15 1.32
టాటా స్టీల్‌ 1,114.50 1.24 అదానీ పోర్ట్స్‌ 807.30 1.14
JSW స్టీల్‌ 702.05 1.09
సిప్లా 956.00 1.01

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
ఐటీసీ 209.80 -2.53
టెక్‌ మహీంద్రా 1,011.80 -1.81
కొటక్‌ మహీంద్రా 1,782.45 -0.81
హెచ్‌డీఎఫ్‌సీ 2,561.70 -0.74
ఐసీఐసీఐ బ్యాంక్‌ 646.10 -0.62