For Money

Business News

చిన్న పొదుపు మొత్తాలపై పాత వడ్డీనే

పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి స్కీమ్‌ వంటి చిన్న పొదుపు మొత్తాలపై ఇపుడున్న వడ్డీ రేట్లను కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి మూడునెలలకు ఒకసారి ఈ పథకాలపై వడ్డీని ప్రభుత్వం సమీక్షిస్తుంది. ఏప్రిల్‌ 1 నుంచి జూన్‌ నెలాఖరు వరకు పాత వడ్డీ రేట్లను కొనసాగించాలని నిర్ణయించింది.సుకన్య సమృద్ధి యోజనపై 7.6 శాతం, సీనియర్‌ సిటిజన్ల సేవింగ్‌ స్కీమ్‌కు 7.4శాతం, పీపీఎఫ్‌పై 7.1 శాతం వడ్డీని కేంద్ర ప్రభుత్వం ఆఫర్‌ చేస్తోంది. ఇటీవల పీఎఫ్‌పై వడ్డీ రేటులను 8.5 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గించడంతో చిన్న పొదుపు మొత్తాలపై కూడా వడ్డీ తగ్గిస్తారని వార్తలు వచ్చాయి.