For Money

Business News

మెట్రో బంపర్‌ ఆఫర్

‘సూపర్ సేవర్ కార్డు’ పేరుతో కొత్త ఆఫర్‌ను హైదరాబాద్ మెట్రో రైల్‌ ప్రకటించింది. ఎల్ అండ్ టీ మెట్రో ఎండీ కె .వి.బి. రెడ్డి -సూపర్ సేవర్ కార్డు-ను ఇవాళ ప్రారంభించారు. ఈ కార్డుతో సెలవుల్లో కేవలం రూ.59తో రోజంతా మెట్రోలో ప్రయాణించవచ్చు. నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రోజంతా తిరగవచ్చు. మెట్రో ప్రకటించిన 100 రోజుల సెలవుల్లోనే (దాదాపు వంద రోజులు) ఈ ఆఫర్ వర్తిస్తుంది.
హైదరాబాద్‌ మెట్రో ప్రకటించిన సెలవులు ఇవి.
ప్రతి ఆదివారం, ప్రతి రెండు, నాలుగో శనివారం, ఉగాది, రంజాన్, మొహర్రం, బోనాలు, స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15), వినాయక చవితి, కృష్ణాష్టమి, దుర్గాష్టమి, దసరా, దీపావళి, బాక్సింగ్ డే (డిసెంబరు 26), బోగీ, సంక్రాంతి, శివరాత్రి