For Money

Business News

ఇవాళ్టికి నిఫ్టి రేంజ్‌ ఇలా…

కార్పొరేట్‌ ఫలితాలు పూర్తవుతున్నాయి. పెద్ద కంపెనీలు లేవు. ఇపుడు మార్కెట్‌ లాక్‌డౌన్‌ సడలింపులు ఒక్కటే హాట్‌ టాపిక్‌. అంతర్జాతీయ మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నా… అధిక స్థాయిలో ఒడుదుడుకులకు లోనవుతున్నాయి. ఈ నేపథ్యంలో నిఫ్టికి 15,700పైన తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఇదే సమయంలో ఇదే స్థాయిలో నిఫ్టి నిలదొక్కునే ప్రయత్నిస్తోంది. ఇక్కడ బ్రేకౌట్‌ వస్తే నిఫ్టి పయనం 16000వైపు సాగనుంది. ఇంట్రా డేకు మాత్రం నిఫ్టి తొలి ప్రతిగటన 15750లోగా ఎదురు కానుంది. కాబట్టి 15770 స్టాప్‌లాస్‌తో నిఫ్టిని అమ్మొచ్చు. రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్లు 15,730 ప్రాంతంలో అమ్మొచ్చు. మిడ్‌సెషన్‌లోగా నిఫ్టిలో స్వల్ప కరెక్షన్‌ రావొచ్చు. 15,675 స్థాయిని నిఫ్టి కాపాడుకుంటుందేమో చూడండి. ఒకవేళ మద్దతు అందింతే.. ఇక్కడే నిఫ్టి కోలుకోవచ్చు. లేదంటే 15,630 ప్రాంతంలో మద్దతు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. 15600 స్టాప్‌లాస్‌తో ఈ స్థాయిలో కొనుగోలు చేయొచ్చు. లాంగ్‌టర్మ్‌ ఇన్వెస్టర్‌కు ట్రెండ్‌ బుల్లిష్‌గానే ఉంది.కాని నిఫ్టి ఓవర్‌ సోల్డ్‌ జోన్‌లో ఉన్నందున…ఎపుడైనా కరెక్షన్‌ రావొచ్చు. ఇవాళ ఇంట్రా డేలో పెద్దగా నష్టాలు ఉండవు. విదేశీ ఇన్వెస్టర్లు గత కొద్దిరోజులుగా నిఫ్టికి మద్దతుగా నిలుస్తున్నారు.