For Money

Business News

ఆదిత్య బిర్లా సన్ లైఫ్ IPO వచ్చేవారమే

ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్‌ మేనేజ్‌మెంట్ పబ్లిక్‌ ఇష్యూ వచ్చే వారం ప్రారంభం కానుంది. సెబి నుంచి ఈ ఇష్యూకు ఇప్పటికే గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. కచ్చిత పబ్లిక్‌ ఆఫర్‌ డేట్స్‌ను త్వరలోనే కంపెనీ వెల్లడించనుంది. పబ్లిక్‌ ఆఫర్ ద్వారా కంపెనీ రూ.3,000 కోట్లను సమీకరించనుంది. ఈ నెలాఖరులోనే పబ్లిక్‌ ఆఫర్‌ ఉండొచ్చని తెలుస్తోంది. ఐపీఓ కోసం ఏప్రిల్ నెలలో సెబీకి ప్రాస్పెక్టస్‌ను కంపెనీ దాఖలు చేసింది. కెనడా కంపెనీ సన్ లైఫ్ ఫైనాన్షియల్ సంస్థ తన వాటాలో కొంత భాగాన్ని ఆఫర్‌లో భాగంగా విక్రయించనుంది. ప్రస్తుతం కంపెనీలో ఏబీసీఎల్‌కు 51 శాతం వాటా ఉంది. మిగిలిన 49 శాతాన్ని సన్ లైఫ్ చేతిలో ఉంది. పబ్లిక్‌ ఆఫర్‌ తరవాత ప్రమోటర్ల వాటా 86.5 శాతానికి చేరుతుంది. జూలై 2021 నాటికి ఆదిత్య బిర్లా ఎంఎఫ్ సంస్థ వద్ద రూ.3 లక్షల కోట్లకు పైగా నిర్వహణా నిధులు (AUM) ఉన్నాయి. నాన్‌ బ్యాంకింగ్‌ విభాగంలో అతిపెద్ద ఫండ్ ఇదే.