For Money

Business News

TITAN ఉద్యోగులకు సెబీ షోకాజ్‌ నోటీసు

దేశంలో అతిపెద్ద వాచ్ అండ్ జ్యూవెలరీ కంపెనీ అయిన టైటన్ కంపెనీ షేర్‌ ట్రేడింగ్‌ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ జరిగినట్లు సెబీ గుర్తించింది. ఆ కంపెనీలో పనిచేస్తున్న 141 మంది ఉద్యోగులకు సెబీ షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. సాధారణంగా టైటాన్‌ ఉద్యోగులు తమ కంపెనీ షేర్లను ట్రేడ్‌ చేస్తే… ఆ విషయాన్ని యాజమాన్యానికి తెలియజేయాల్సి ఉంటుంది. అది కంపెనీ నిబంధన. కంపెనీ ప్రమోటర్లు, ఉద్యోగులు, డైరెక్టర్లు తమ కంపెనీ షేర్లను కొనుగోలు చేసినా, అమ్మినా రెండు ట్రేడింగ్‌ రోజుల్లో కంపెనీకి తెలియ జేయాల్సి ఉంటుంది. 2018-2019 ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షలకు మించి విలువైన షేర్లలో ట్రేడ్‌ చేశారని.. అయితే కంపెనీకి తెలియజేయలేదని సెబీ పేర్కొంది. సెబీ చర్యల గురించి టైటాన్‌ ప్రతినిధి సంప్రదించగా… ఇది సెబీకి, ఆయా ఉద్యోగులకు సంబంధించిన అంశమని, ఇందులో కంపెనీ పాత్రలేదని ఎకనామిక్‌ టైమ్స్‌ పత్రిక ప్రతినిధికి తెలిపారు.