మార్కెట్లోకి గ్రేటా ఈవీ
గ్రేటా ఎలక్ట్రిక్ స్కూటర్స్ సంస్థ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. గ్రేటా హార్పర్ జెన్ఎక్స్ సిరీస్ -1గా పిలిచే ఈ మోడల్ ప్రారంభ ధర రూ.41,999 ( ఎక్స్ షోరూం ). కాని ఇది కేవలం వెహికల్ ధర మాత్రమే. బ్యాటరీ, ఛార్జర్‌ను విడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 60 కి.మీల వరకు నడిచేందుకు వీలున్న ‘వీ 2 48 వీ-24 ఏహెచ్ బ్యాటరీ ధర రూ .17,000 – 20,000 కాగా .. 100 కి.మీ ప్రయాణించేందుకు వీలున్న ‘వీ 3 + 60వీ-30 ఏహెచ్ బ్యాటరీ ధర రూ.27,000- 31,000 మధ్య లభిస్తుంది. ఇక ఛార్జర్ ధర మరో రూ.3,000- 5,000 మధ్య ఉంటుందని కంపెనీ తెలిపింది. రూ .2,000 డౌన్ పేమెంట్ స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ తరవాత 45- 75 రోజుల్లో డెలివరీ చేస్తారు.
