దేశీ ఫోన్ల తయారీకి స్కీమ్
ఇప్పటి మన దేశంలో అత్యధికంగా అమ్ముడుబోతున్న ఫోన్లు విదేశీనే. అందుకే ప్రభుత్వం దేశీ ఫోన్ల తయారీ కోసం ఓ స్కీమ్‌ను ప్రారంభించింది. ఈ స్కీమ్‌కు ఏకంగా రూ. 62,500 కోట్లు కేటాయించింది. అంటే మొబైల్ ఫోన్స్ కోసం పీఎల్‌ఐ స్కీమ్ అన్నమాట. పూర్తిగా దేశీయంగా తయారు చేసిన పరికరాలతోనే ఈ ఫోన్లను తయారు చేయాల్సి ఉంటుంది. మొబైల్ ఫోన్ మాన్యూఫ్యాక్చరింగ్ స్కీమ్ (MPMS) పేరుతో ప్రారంభించే ఈ స్కీమ్ 2026-27 నుంచి 2030-31 వరకు అమల్లో ఉంటుంది. ఈ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం 2.25 శాతం నుంచి 5 శాతం వరకు ప్రోత్సాహకాలు (Incentives) ఇస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. మొబైల్ ఫోన్ల తయారీతో పాటు మొబైల్ ఫోన్ బ్రాండ్లను ప్రోత్సహించేందుకు ఈ స్కీమ్‌ను తెచ్చినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే ఈ రంగం కోసం ప్రారంభించిన పీఎల్‌ఐ స్కీమ్ కింద రూ. 7000 కోట్లు టార్గెట్ పెట్టుకోగా, రూ. 20500 కోట్లు పెట్టుబడులు వచ్చినట్లు మంత్రి తెలిపారు.
