11 శాతం పెరిగిన బిట్ కాయిన్
క్రిప్టో కరెన్సీలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చూపుతున్న చొరవతో ఇవాళ బిట్ కాయిన్ ఏకంగా 11 శాతం దాకా పెరిగింది. ఇతర క్రిప్టో కరెన్సీలు కూడా బాగా పెరిగాయి. క్రిప్టో కరెన్సీ చట్టానికి కొన్ని కీలక సవరణలు చేసిన ట్రంప్.. వాటి ఆమోదం కోసం తాజాగా పిలుపు ఇచ్చారు. కొత్త సవరణలను ఆమోదించాలని ఆయన కాంగ్రెస్‌ను కోరారు. ఇవాళ బిట్ కాయిన్ 72000 డాలర్లను దాటడం విశేషం. జూన్ తరవాత ఈ స్థాయి ర్యాలీ రావడం ఇదే మొదటిసారి. దాదాపు వంద కోట్ల డాలర్ల షార్ట్ పొజిషన్స్ కేవలం గంటలో స్క్వేర్ ఆఫ్ అయ్యాయి. బిట్ కాయిన్ ETFలోకూడా ఇవాళ 52 కోట్ల డాలర్ల నికర కొనుగోళ్ళు జరిగాయి.
