For Money

Business News

2027-మోర్గాన్‌ స్టాన్లీ టార్గెట్‌ ఇదే

గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్‌లో బులియన ధరలు జోరుపై ఉన్నాయ. ముఖ్యంగా వెండి భారీ లాభాలతో ట్రేడవుతోంది. ఇక బంగారం కూడ ఆకర్షణీయ లాభాలు గడిస్తోంది. నిన్న ఆరు శాతం దాకా భారీ లాభాలు పొందిన బంగారం ఇవాళ కూడా గ్రీన్‌లో ఉంది. మరోవైపు 2027లో కూడా బంగారం ర్యాలీ కొనసాగుతుందని మోర్గాన్‌ స్టాలీ అంచనా వేసింది. మెర్గాన్‌ స్టాన్లీ అంచనాలకు మించి ముందే బంగారం ధర 4450 డాలర్లను దాటింది. ఇపుడు 4560 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వచ్చే ఏడాది బంగారం ఔన్స్‌ ధర 5000 డాలర్లను దాటుతుందని అంచనా వేసింది. సాధారణ మార్కెట్‌లో డిమాండ్‌తో పాటు కేంద్ర బ్యాంకుల నుంచి డిమాండ్‌ కొనసాగుతోందని మోర్గాన్‌ స్టాన్లీ తన తాజా నివేదికలో వెల్లడించింది. అమెరికాలో పెరుగుతున్న ద్రవ్యలోటు, ప్రభుత్వ రుణాలపై ప్రజల్లో ఆందోళన ఉందని ఆ సంస్థ పేర్కొంది. మున్ముందు డాలర్‌ విలువ క్షీణిస్తుందని అమెరికన్లు భావిస్తున్నారని తెలిపింది.

Leave a Reply