For Money

Business News

బాండ్‌ ఉత్సాహం గాయబ్‌… నష్టాలే

బాండ్‌ ఈల్డ్స్‌ను తగ్గించేందుకు ఫెడరల్‌ బ్యాంక్‌ ప్రకటించిన ట్రెజరీ బాండ్ల బైబ్యాక్‌ పెద్దగా ప్రభావం చూపలేదు. ఇవాళ డాలర్‌ ఇండెక్స్‌ స్థిరంగా ఉన్నా… వాల్‌స్ట్రీట్‌ నష్టాల్లో ట్రేడవుతోంది. అన్ని సూచీలు దాదాపు ఒక శాతం వరకు నష్టంతో ఉన్నాయి. వాల్‌మార్ట్‌ ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడంతో డౌజోన్స్‌పై ప్రతికూల ప్రభావం పడింది. మోడెర్నా షేర్‌ ఇవాళ 25 శాతం క్షీణించింది. అయితే చిప్‌ కంపెనీ మైక్రాన్‌, స్కాన్‌డిస్క్‌ ఆకర్షణీయ లాభాల్లో ఉన్నాయి. అయినా నాస్‌డాక్‌ 0.9 శాతం నష్టంతో ట్రేడవుతోంది. డాలర్‌ స్థిరంగా ఉన్నా బులియన్‌లో దౌడు కన్పిస్తోంది. వెండి ఏకంగా మూడు శాతం పెరగ్గా, బంగారం మాత్రం నామమాత్రపు లాభాల్లో ఉంది. అయితే ఔన్స్‌ బంగారం ధర మాత్రం 4560 డాలర్లపైనే ఉంటోంది. ఇక క్రూడ్‌ ధరలు మాత్రం తగ్గే ఛాన్స్‌ కన్పించడం లేదు. ఇరాన్‌, అమెరికా మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. బ్రెంట్‌ క్రూడ్‌ ఏకంగా 94 డాలర్ల దరిదాపుల్లో ఉండటం ఆందోళన కల్గిస్తోంది.

Leave a Reply