ఓపెన్ ఆఫర్‌కు సెబీ అనుమతి
ప్రీమియం ఎక్స్‌ప్లోజివ్స్ వాటాదారులకు అపోలో మైక్రో సిస్టమ్స్ ప్రకటించే ఓపెన్ ఆఫర్‌కు స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబి ఆమోదం తెలిపింది. ఒక్కో షేర్‌కు రూ. 698 ధరకు అపోలో మైక్రో ఓపెన్ ఆఫర్ ప్రకటించనుంది. వాటాదారుల నుంచి 26 శాతం వాటా అంటే 1.4 కోట్ల షేర్లను అపోలో మైక్రో కొనుగోలు చేయనుంది. సీసీఐ నుంచి ఇక అనుమతి పొందాల్సి ఉంది. సీసీఐ నుంచి ఆమోదం వచ్చిన తరవాత 12 రోజుల్లో ఓపెన్ ఆఫర్ ప్రకటిస్తారు. అలాగే ఓపెన్ ఆఫర్‌లో దరఖాస్తు చేసుకున్న వాటాదారులకు పది రోజుల్లో సొమ్ము చెల్లించాల్సి ఉంటుందని సెబీ పేర్కొంది. జులై నెలలో ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ యాజమాన్యం నుంచి 41.33 శాతం వాటాను అపోలో మైక్రో కొనుగోలు చేసింది. మొత్తం డీల్ విలువ రూ. 1550 కోట్లు. మొత్తం కంపెనీ తన చేతికి రావాలంటే 2.2 కోట్ల షేర్లను కొనాల్సి ఉంటుంది.
