థైరోకేర్‌ను టేకోవర్ చేసిన ఫార్మ్‌ఈజీ
హెల్త్‌కేర్ రంగంలో ముఖ్యంగా ఆన్‌లైన్ బిజినెస్ సంస్థల జోరు పెరుగుతోంది. లిస్టెడ్ కంపెనీ అయిన ప్రముఖ వ్యాధి నిర్ధారణ పరీక్షల సంస్థ థైరోకేర్ టెక్నాలజీస్‌ను డిజిటల్ హెల్త్‌కేర్ కంపెనీ ‘ఫార్మ్‌ఈజీ’ టేకోవర్ చేస్తోంది.దీంతో ఫార్మ్‌ఈజీ లిస్టింగ్ అయినట్లే. థైరోకేర్ కంపెనీ విలువను రూ. 6,300 కోట్లుగా లెక్కగట్టారు. థైరోకేర్ ఈక్విటీలో 66.1 శాతం వాటాను రూ.4,546 కోట్లకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదరింది. ఈ డీల్‌ను ఫార్మ్‌ఈజీ స్టార్టప్ మాతృసంస్థ ఏపీఐ హోల్డింగ్స్ ప్రకటించింది. మరో 26 శాతం షేర్లను ఏపీఐ ఓపెన్ ఆఫర్ ద్వారా కొనుగోలు చేస్తుంది. ఇందుకోసం రూ.1,788 కోట్లు వెచ్చించనుంది. దీంతో మొత్తం డీల్ విలువ రూ.6,334 కోట్లుగా ఉండనుంది. నిన్న స్టాక్ మార్కెట్‌లో థైరోకేర్ టెక్నాలజీస్ షేర్ రూ. 1450 వద్ద ముగిసింది. అయితే రూ. 1300లకు షేర్‌కు ఆఫర్ చేస్తామని ఏపీఐ హోల్డింగ్స్ అంటోంది. మరి ఇన్వెస్టర్లు అమ్ముతారా? డీలిస్టింగ్ ప్రస్తావన రాలేదు కాబట్టి… షేర్ స్టాక్ ఎక్స్ఛేంజీలో కొనసాగుతుందన్నమాట.
