For Money

Business News

జొమాటో.. మూడింతలైన నష్టాలు

మార్చి నెలతో ముగిసిన మూడు నెలల కాలంలో జొమాటొ కన్సాలిడేటెడ్‌ నష్టాలు రూ.359 కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ నికర నష్టం రూ. 134 కోట్లు. అంటే దాదాపు మూడు రె౮ట్లు పెరిగాయన్నమాట. కంపెనీ ఆదాయం కూడా 75 శాతం పెరిగి రూ. 692 కోట్ల నుంచి రూ. 1211 కోట్లకు చేరింది. టర్నోవర్‌లో నాలుగో వంతు నష్టాలే అన్నమాట. ఇక పూర్తి ఏడాదికి చూస్తే కంపెనే రూ.4192 కోట్ల టర్నోవర్‌పై రూ. 1222 కోట్ల నష్టం ప్రకటించింది. గత ఏడాది రూ. 1993 కోట్ల టర్నోవర్‌పై రూ. 816 కోట్ల నష్టం చూపింది. గత ఏడాది సగటున ఒక ఆర్డర్‌ విలువ రూ. 397 కాగా, ఈ ఏడాది రూ. 398. అయితే టాప్‌ 8 ప్రధాన నగరాల్లో ఆర్డర్‌ వ్యాల్యూ పెరిగిందని జొమాటొ యాజమాన్యం పేర్కొంది. తమ ఫిక్సెడ్‌ కాస్ట్‌ కంటే ఆదాయం పెరుగుతోందని తెలిపింది. కరోనా సమయంలో డెలివరీ బాయ్స్‌ కొరత లేదని, ఇపుడు అన్ని పరిశ్రమలు తెరిచినందున చాలా మంది ఇతర ఉద్యోగాలకు వెళ్ళారని.. ఇపుడు డెలివరీ బాయ్‌ సమస్య కొంత ఉందని, త్వరలోనే తగ్గిపోతుందని జొమాటొ పేర్కొంది.