For Money

Business News

అదరగొట్టిన డౌజోన్స్‌

యూరో మార్కెట్‌ చాలా ఉత్సాహంగా ఉన్నాయి. స్వల్ప లాభాలతో మొదలైన మార్కెట్లు క్రమంగా బలపడ్డాయి. ప్రధాన మార్కెట్లు ఒకటిన్నర శాతం లాభపడగా, యూరో స్టాక్స్‌ 50 సూచీ 1.4 శాతం లాభంతో ఉంది. ఇక ఉదయం నుంచి లాభాల్లో ఉన్న అమెరికా ఫ్యూచర్స్‌కు కొనసాగింపుతో వాల్‌స్ట్రీట్‌ లాభాలతో ప్రారంభమైంది. డౌజోన్స్‌ రెండు శాతంపైగా లాభంతో ట్రేడవుతుండగా… ఎస్‌ అండ్ పీ 500, నాస్‌డాక్‌ సూచీలు ఒక శాతంపైగా లాభంతో ఉన్నాయి. చాలా రోజులు తరవాత డాలర్‌ ఒక శాతం దాకా పడింది. డాలర్‌ ఇండెక్స్‌ ఇపుడు 102 వద్ద ఉంటోంది. దీంతో బులియన్‌ గ్రీన్‌లో ఉంది. బంగారం మళ్ళీ 1850 డాలర్ల వద్ద ఉంది. ఇక బ్రెంట్‌ క్రూడ్‌ కూడా 113 డాలర్ల వద్ద కొనసాగుతోంది.