For Money

Business News

నష్టాలు తగ్గించుకున్నజొమాటొ

సెప్టెంబర్‌ నెలతో ముగిసిన త్రైమాసికంలో జొమాటొ కన్సాలిడేటెడ్‌ నికర నష్టం రూ. 251 కోట్లకు తగ్గించుకుంది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ నికర నష్టం రూ. 430 కోట్లు. ఇదే సమయంలో కంపెనీ ఆదాయం కూడా 62 శాతం పెరిగి రూ. 1661 కోట్లకు చేరింది. ఆగస్టు నెలలో బ్లింకిట్‌ను టేకోవర్‌ చేసినందున… ఈ ఫలితాలలో 50 రోజుల బ్లింకిట్‌ నుంచి వచ్చిందని కంపెనీ పేర్కొంది. ఈ ఫలితాలను పక్కన బెట్టినా.. జొమాటొ టర్నోవర్‌ 48 శాతం పెరిగింది. నష్టాలు మరింత తగ్గుతాయని.. త్వరలోనే ఆరు నెల్లో లేదా 12 నెలల్లో కంపెనీ లాభాల్లోకి వస్తుందని జొమాటో ఆశిస్తోంది.